
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లో గుంటూరుకి ప్రాధాన్యత లభించింది. (రెరా) సభ్యుడిగా ప్రముఖ ఆడిటర్, టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన ఎంపికకు కృషి చేసినందుకు గళ్ళా మాధవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ…. “ప్రజా ప్రయోజనాలకు, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నాణ్యత, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రెరా కీలక పాత్ర పోషిస్తుందని, తన అనుభవం, ఆర్థిక నైపుణ్యం ఈ రంగానికి మరింత బలం చేకూరుస్తుందని, దామంచర్ల శ్రీనివాసరావు సేవలు మరింత ఉపయోగపడతాయన్నారు.








