
గుంటూరు ;-పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇది వరుసగా తొమ్మిదో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం కాగా, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా విన్నారు. ప్రతి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందిస్తూ, సాధ్యమైన పరిష్కారాలు, అవసరమైన చర్యలు, ఫాలోఅప్‌లను చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు సమస్యల పరిష్కారం ద్వారా ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయం మహిళలతో కళకళలాడుతుందని, మహిళలు ఎలాంటి భయం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా ఓపెన్ వేదికగా మహిళా గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు సమస్యల నుంచి విముక్తి పొంది, ఆర్థికంగా బలంగా, గౌరవంగా, స్వావలంబనతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.Guntur Local News
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతం దిశగా మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, టీమ్‌వర్క్‌తో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.










