గుంటూరుఆంధ్రప్రదేశ్
GUNTUR Several service programs were held under the auspices of the Student Union for the Nation.
స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. 100 మంది విద్యార్థులకు 5 లక్షల స్కాలర్షిప్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యశ్వంత్, లక్ష్మణరెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పేదల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని లక్ష్మణరావు సూచించారు. పేద విద్యార్థులు కూడా దాతల సహాయాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అదేవిధంగా అందరి సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యశ్వంత్ తెలిపారు.