గుంటూరు జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లు కు సంబంధించి అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు అధికారులకు వారి సేవలను గుర్తించి ఎస్పీ చేతుల మీద ప్రశంసా పత్రం, మెమెంటో లు అందజేశారు.అందులో భాగంగా పెదకాకాని సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులు , అలాగే పలు దొంగతనాలకు సంబంధించిన కేసులు చేధించడంతో పాటు, పలు కీలక కేసులో పురోగతి సాధించినందుకు , కోర్టు పెండింగ్ కేసులను పరిష్కరించడంలో కృషి చేసినందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పెదకాకాని సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని అభినందించారు. శనివారం జిల్లా ఎస్పీ చేతుల మీదగా ప్రశంసా పత్రం, మెమెంటో నారాయణ స్వామి అందుకున్నారు. విధుల్లో భాగంగా తనకు సహకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అడిషనల్ ఎస్పీ రవి కుమార్ డీఎస్పీ మురళీకృష్ణ కు సీఐ నారాయణ స్వామి ధన్యవాదాలు తెలిపారు. సీఐ నారాయణ స్వామి తో పాటు పెదకాకాని పోలీస్ స్టేషన్ సిబ్బందినిఅభినందించారు
234 Less than a minute