TODAY NEWS: ఎస్సీ వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్..
ఎస్సీ వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్..
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రారంభించడం దారుణమైన అంశమని..
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు.
ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎస్సీ వర్గీకరణ కోసం కమీషన్ వేయడం సరైన విధానం కాదన్నారు. ఈమేరకు గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బ్రిటిష్ పాలకుల తరహాలో విభజించు పాలించు విధానాలు అమలౌతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏక సభ్య కమిషన్ మెంబర్ మిశ్రాకు అంటరానితనం అంటే తెలియదని చెప్పారు.
రిజర్వేషన్లు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు అంటూ సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని తిరుపతిలో ఉండాలని కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూది లేదు, దూది లేదు అయినప్పటికీ రాజధాని పేరుతో 60 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అమరావతి భజన చేయకుండా అన్ని ప్రాంతాలకు నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాంకులు, జడ్జిలు, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ పాటించాలని ఆయన సూచించారు. ఉగాది పండుగ లోగా జర్నలిస్టు లకు 5 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.