ఆంధ్రప్రదేశ్
తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని టీడీపీ గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు. ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు పాల్గొన్నారు.