
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈమేరకు వైసీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైసిపి నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, యువజన యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ కళ్ళం హరికృష్ణా రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. నిరుద్యోగ భృతిని ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.








