రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు. ఈమేరకు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావుని ఆయన పరామర్శించారు. అనంతరం
సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2,232 Less than a minute