ఆనందోత్సాహాల నడుమ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలి + ఏపీయూడబ్ల్యూజే, శ్రీ సాకేత రామ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ
ఆనందోత్సాహాల నడుమ ప్రతిఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆకాంక్షించారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు నగర కమిటీ, శ్రీ సాకేత రామ మిత్రమండలి అధ్యక్షులు, 4వ మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి కృష్ణ చైతన్య సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శ్రీనగర్ మెయిన్ రోడ్డులో గల శ్రీ సాకేత రామ ఎంటర్ప్రైజెస్ నందు వినాయక చవితిని పురస్కరించుకొని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎలాంటి కార్యక్రమాలు ఆరంభం చేయాలన్నా గణపతి పూజ చేయడం ఆనవాయితీ అని, ఈ పండుగు నాడు పతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, విశాలాంధ్ర జిల్లా ఇన్చార్జి వీఎల్ నరసింహారావు, ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్షుడు కె.వెంకయ్య, నగర కార్యదర్శి కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వర రావు, ఏ. వీరభద్రరావు, కోశాధికారి షేక్ సుభాని, సహాయ కార్యదర్శులు కె.సుజిబాబు, జి.అప్పారావు, కార్యవర్గ సభ్యులు చెరుకూరి సుబ్బారావు, కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు భజరంగ రామకృష్ణ, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, వాత్సల్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశంశెట్టి చంద్రశేఖర్, అట్లూరి ధనుంజయ, షేక్. మున్ని, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.