
గుంటూరు, అక్టోబర్ 14:దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌లో లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ గంపల సాంబశివరావు, ఇటీవల జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి ఈత పోటీల్లో విశిష్ట ప్రతిభ కనబర్చారు. మొత్తం 9 పతకాలు సాధించి, గుంటూరు డివిజన్‌కే కాకుండా మొత్తం రైల్వే శాఖకు గౌరవం తీసుకువచ్చారు.
అక్టోబర్ 11, 12 తేదీల్లో మంగళగిరిలో జరిగిన జాతీయ స్థాయి ఈత చాంపియన్‌షిప్‌లో ఆయన రెండు బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ పోటీలు భారత తొలి ఒలింపిక్ ఈతగాడు ఎస్. మహేబూబ్ షంషేర్ ఖాన్ స్మారకంగా నిర్వహించబడ్డాయి. ఇందులో శ్రీ సాంబశివరావు సాధించిన విజయాలు ఇవే:2 బంగారు పతకాలు – 25 మీటర్ల బటర్‌ఫ్లై, 4×25 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే1 వెండి పతకం – 25 మీటర్ల ఫ్రీస్టైల్2 కాంస్య పతకాలు – 50 మీటర్ల బటర్‌ఫ్లై, 4×25 మీటర్ల మెడ్లీ రిలేఅంతకుముందు, అక్టోబర్ 10న గుంటూరులోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన 8వ అంతర్జిల్లా మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్లో ఆయన అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు:50 మీటర్ల బటర్‌ఫ్లై100 మీటర్ల ఫ్రీస్టైల్100 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ25 మీటర్ల బటర్‌ఫ్లైఈ విజయాలపై గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుధేష్ణ సేన్, అదనపు డివిజనల్ మేనేజర్ శ్రీ ఎం. రమేష్ కుమార్‌లు శ్రీ సాంబశివరావును ప్రత్యేకంగా అభినందించారు. “ఆయన అంకితభావం, క్రమశిక్షణ ప్రతి ఉద్యోగికి ఆదర్శం. ఇలాగే ముందుకు సాగి గుంటూరు డివిజన్, రైల్వే శాఖ, రాష్ట్రానికి మరింత ఖ్యాతిని తీసుకురావాలి,” అని వారు పేర్కొన్నారు.రాష్ట్రం, దేశ స్థాయిలో ఘనత సాధించిన గంపల సాంబశివరావు ఈ విజయాలతో దక్షిణ మధ్య రైల్వేకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.







