Guru Puja celebrations under the auspices of the Bharatiya Janata Party..
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు..
వినుకొండ :- భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్. మాధవ్ ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ సూచనల మేరకు వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేవలం విద్యను ప్రసాదించే వారే కాకుండా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిచే ఎంతోమంది ఉపాధి, సేవా దృక్పథం అనే ఆలోచనతో మన వినుకొండ పట్టణంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన గురువులను సన్మానించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సన్మాత గ్రహీతలైన కోట మల్లికార్జున రావు వీరు జగద్గురు పీఠం తరపున వేద పఠనం అధ్యాపకులుగా గత 30 సంవత్సరముల నుండి ఎంతోమందికి వేద పఠనం నేర్పించి వారిచే వినుకొండ పట్టణంలో కార్తీక మాసంలో సుమారు 150 పైన రుద్రాభిషేకములు మరియు హోమములు నిర్వహించడం జరిగినది. మరో సన్మాన గ్రహీత బొడ్డు చర్ల ప్రసాద్ వీరు వినుకొండ పట్టణంలో గత 40 సంవత్సరముల నుండి పెయింటర్ వృత్తిని చేస్తూ వీరు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ సుమారు 300 మంది పైగా పెయింటర్స్ ని తయారు చేసి ఉన్నారు వీరు గీసిన చిత్రములకు గిన్నిస్ బుక్ రికార్డు మరియు ఎన్టీఆర్ పురస్కారము, మహానంది అవార్డులు అనేకమైన సుమారు 100కు పైగా అవార్డులు తీసుకున్న ప్రముఖ వ్యక్తి మరో సన్మాన గ్రహీత సోమేపల్లి సీతారామయ్య గారు మీరు వృత్తిరీత్యా కండక్టర్ ప్రవృత్తి రీత్యా అధ్యాపకులు వీరు వారి హ్యాండ్ రైటింగ్ నైపుణ్యంతో ఎంతోమందికి విద్యను నేర్పించి వారికి జాతీయ అంతర్జాతీయ అవార్డు రావడానికి ఎంతో దోహదపడ్డారు వీరికి ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ కలిసి హ్యాండ్ రైటింగ్ ప్రవీణ అనే బిరుదును కూడా ఇచ్చినారు.
మరొక సన్మాన గ్రహీత గాలి రేవతి దేవి వీరు ప్రముఖ భరతనాట్య అధ్యాపకురాలుగా సేవలు చేస్తున్నారు వీరు 1980 నుండి భరతనాట్యం మీద అపేక్షతో నేర్చుకుని ఎన్నో రాష్ట్ర మరియు జిల్లా అవార్డులు గెలుచుకున్నారు వీరి యొక్క శిష్య బృందం శ్రీశైల దేవస్థానం నందు మరియు ఎన్నో రాష్ట్ర మరియు జిల్లా కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్, జిల్లా కార్యదర్శి గొడవర్తి సుజాత, జిల్లా కార్యదర్శి జాన్ బాబు, పట్టణ కార్యదర్శులు సుధా గణేష్, పాలడుగు రాజు ,పట్టణ యూత్ అధ్యక్షులు అంబటి వెంకట రెడ్డి, దేవతి చిన్న నరసింహారావు, దేసు లక్ష్మీనారాయణ, గర్ర రామచంద్రరావు, పట్టణ సీనియర్ కార్యకర్తలు అచ్యుత మూర్తయ్య,అప్పల రాజా, మరియు బిజెపి సీనియర్ కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.