

బాపట్ల,నవంబర్ 23 : హ్యాపీ సండే కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం సాయంత్రం స్థానిక బాపట్ల పట్టణం, బావ నారాయణ స్వామి ఆలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే .సంతోషం సందడి మరియు ఆరోగ్యం, ఆనందం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాధ్ రెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాపీ సండే కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామి కావాలని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అందులో భాగంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇకపై పట్టణంలో ప్రతి ఆదివారం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల బాలబాలికల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు.
రానున్న ఆదివారం రోజు సాంస్కృతి కార్యక్రమాల లో పాల్గొనదలచిన బాలబాలికలు ముందుగానే మున్సిపల్ కమిషనర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల కళారూపాలను ప్రదర్శించుకొనడానికి హ్యాపీ సండే కార్యక్రమం మంచి వేదికని తెలిపారు. ఇక్కడ ప్రదర్శించిన బాల బాలికలకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని దాని ద్వారా రాష్ట్రస్థాయి లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ల బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పుర ప్రజలను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







