
స్వచ్ఛ భారత్ లో పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతల పై కూడా దృష్టి పెట్టాలి….ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్తనందాయపాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పై కూడా విద్యార్ధిని విద్యార్ధులకు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పేరుతో నేలలో ప్రతి మూడవ శనివారం గ్రామాలలో స్వచ్ఛత పై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం సంతోష దాయకం అని తెలియ జేశారు. అందులో భాగంగా ఈరోజు కొత్త నందాయ పాలెం గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్ధిని విద్యార్ధులకు వ్యక్తిగత పరిశుభ్రత పై సంపూర్ణ అవగాహన కల్పించి, కార్యదర్శి మురళి రెడ్డి ద్వారా పిల్లలకు మరియు గ్రామస్తులకు ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ఎంపీటీసీ తాండ్ర తెలిపారు.
అవగాహనా కార్యక్రమాల అనంతరం విద్యార్ధిని విద్యార్ధులకు ఏ విధంగా చేతులు శుభ్రం చేసుకోవాలో తెలియ జేసే కార్యక్రమాన్ని స్వయంగా సర్పంచ్ మరియు ఎంపీటీసీ లు చేపట్టారు.
కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంగీత బాబు, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








