రోజూ రెండు పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా|| 2 Raw Garlic Cloves Daily: Health Benefits You Never Knew..
రోజూ రెండు పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా
🧄 రోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే మీకు కలిగే ఆరోగ్య మేళ్లు
మన అందరికీ తెలిసిన సాధారణ మసాలా పదార్థం వెల్లుల్లి. వంటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఎంతో మంది దీనిని కేవలం రుచికోసం మాత్రమే వాడతారు. నిజానికి వెల్లుల్లి పచ్చిగా తింటే ఇది ఆరోగ్యానికి ఇచ్చే ప్రయోజనం చెప్పలేనంత గొప్పది.
ఇది ‘సూపర్ ఫుడ్’ అని ఎందుకు అంటారో తెలుసా? అందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరానికి సహజ రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు, throat infection లాంటి సమస్యలను తగ్గించడానికి ఇలాంటివి సహజ ఆయుధాలు అవుతాయి.
👉 ఇలా తింటే ఎక్కువ మేలు
వెల్లుల్లిని రోజూ రెండు రెబ్బలు పచ్చిగా తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు పాటిస్తేనే పూర్తి లాభం అందుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నూరి, లేదా చిన్న ముక్కలుగా చేసి తినాలి. ఎందుకంటే నూరితే అందులోని అల్లిసిన్ పూర్తిగా పనిచేస్తుంది. కొన్ని మంది చిన్న ముక్కలుగా నమిలి తినలేరు అంటారు. అలాంటప్పుడు సన్నగా తరిగి గోరువెచ్చని నీటితో కలిపి తాగేయచ్చు.
👉 రక్తపోటు, కొలెస్ట్రాల్ కు కవచం
మనం రోజూ తీసుకునే ఆహారంలో చక్కగా పచ్చి వెల్లుల్లి ఉంటే అది రక్తపోటును నియంత్రిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి గుండెకు సంబందించిన సమస్యలున్నవారు కూడా వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో దీనిని తీసుకోవచ్చు.
👉 ఇమ్యూనిటీని బలపరుస్తుంది
వెల్లుల్లిలోని అల్లిసిన్, విటమిన్లు, ఖనిజాలు మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, రోగాలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినడం వలన రక్తంలో ఫ్రీ రాడికల్స్ తగ్గి శరీరం detox అవుతుంది.
👉 లివర్ కు కూడా సపోర్ట్
పచ్చి వెల్లుల్లి లివర్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఎక్కువగా మద్యం తీసుకునే వారి కోసం ఇది liver ని రక్షించడానికి సహాయకారి అవుతుంది. వ్యర్థాలన్నీ బయటకు వెళ్లడానికి సులభం అవుతుంది.
👉 జీర్ణక్రియ సమస్యలకు పరిష్కారం
గ్యాస్టిక్, bloating, acidity సమస్యలు తరచూ వచ్చే వారికి కాస్త జాగ్రత్తగా మొదలుపెట్టాలి. చిన్న మోతాదులో మొదలుపెట్టి శరీరం అలవాటు అయిన కొద్దీ మోతాదు పెంచుకోవాలి. వేడి నీటితో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది ఉండదు.
👉 ఎప్పుడు తినాలి?
ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి పూర్తి మేలు జరుగుతుంది. అందులోని పోషకాలు మంచి రీతిలో జీర్ణమై అవి పనిచేయడానికి పూర్తి స్థాయి అవకాశం లభిస్తుంది.
👉 ఎంత తినాలి?
ఎల్లప్పుడూ రెండు రెబ్బలు తినమని మాత్రమే చెబుతారు కానీ, శరీర తత్వం బట్టి కొంతమందికి మొదట్లో gastritis, acidity సమస్యలు రావచ్చు. కాబట్టి మొదట ఒక రెబ్బతో మొదలుపెట్టి, రెండు వరకు పెంచుకోవాలి.
👉 ఎవరు తీసుకోకూడదు?
గ్యాస్ట్రిక్, అల్సర్స్ ఉన్నవారు, రక్తం తొందరగా గడ్డకట్టని సమస్యలున్నవారు, blood thinner మందులు వాడేవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.