
విశాఖపట్నం, ఫిబ్రవరి 8:– ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సభ్యులు, ప్రైవేట్ ఆరోగ్య సంస్థల నిర్వాహకులకు “సమగ్రమైన హెచ్‌ఐవీ సంరక్షణ మరియు చికిత్స” అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల పరిధిలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవన సమావేశ మందిరంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా IMA అధ్యక్షురాలు డాక్టర్ ఐ. వాణి, కింగ్ జార్జ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీమోహన్, IMA సెక్రటరీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. అలాగే పెప్‌ఫార్ ప్రతినిధి డాక్టర్ ఉమా సుందరి (రిటైర్డ్ RDO), APSACS డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి, జిల్లా కుష్టు వ్యాధి–ఎయిడ్స్ & టీబీ అధికారి డాక్టర్ ఆర్. రమేష్, షేర్ ఇండియా సంస్థ ప్రతినిధులు డాక్టర్ ప్రభు, నాగార్జున, రమేష్, శ్రీమతి పద్మ పాల్గొన్నారు. క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ పట్నాయక్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు ART, OST సిబ్బంది కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు.visakhapatanam Local News :ఆడిట్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి-(PUC) చైర్మన్ కూన రవికుమార్
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ చట్టం, హెచ్‌ఐవీ మందుల వినియోగం, చికిత్సా విధానాలపై వైద్య ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు APSACS డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి విపులంగా సమాధానాలు ఇచ్చారు. హెచ్‌ఐవీ బాధితులకు సమగ్ర సంరక్షణ అందించడంలో ప్రైవేట్ వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో APSACS సంస్థ ప్రతినిధులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు జ్ఞాపికను బహూకరించారు.










