
పల్నాడు జిల్లా:23-10-25:-ప్రజా రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న హోం గార్డ్ సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు పేర్కొన్నారు.
జిల్లాకు చెందిన హోం గార్డ్ HG 467 టి.వి.కె. బాబ్జీ గారు డిప్యూటేషన్‌పై విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వర్తించి, గత జూన్ 5వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా, ఆయనకు ఈరోజు రూ.5,00,000 చెక్కును శ్రీ ఎస్పీ గారి చేతుల మీదుగా అందజేశారు.హోం గార్డ్ సిబ్బంది సమస్యలను, అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను సూచిస్తున్న హోం గార్డ్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ గారి కృషిని ఎస్పీ గారు ఈ సందర్భంలో ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు హోం గార్డ్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ గారు పాల్గొన్నారు.







