వినుకొండలో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో 89వ అన్నదాన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సంఘ కార్యాలయ ఆవరణలో జరుగగా, కీ.శే పుట్టం రాజు రంగనాయకమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నారాయణ రావు, సతీమణి బేబీ సరోజినితో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్టిఓ భువనగిరి శేష సాయి హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, సమాజానికి సేవ చేయడం ఒక గొప్ప లక్ష్యమని, విశ్రాంత ఉద్యోగులు తమ జీవితంలో సేవాభావాన్ని కొనసాగించడం అనందదాయకమని కొనియాడారు.
సంఘ కార్యదర్శి భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని, నేడు 89వ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని తెలిపారు. వారి మాటల్లో – “సభ్యుల సహకారంతో అన్నదానం, ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే దిశగా ముందుకెళ్తాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో జి. నాగేంద్రుడు, గోపీచంద్, బిపిఎస్ సుందరరావు, వైవి సుబ్బయ్య శర్మ, అవ్వారు కోటేశ్వరరావు, ఎం.వి. శర్మ, శంకర్రావు, దీక్షితులు, నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో భోజనాలను అందించి, సమాజ సేవలో తాము ముందుంటామని విశ్రాంత ఉద్యోగులు స్పష్టంచేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంలో, దాతలు మరియు సేవా సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, తద్వారా మానవతా విలువలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.