

జిల్లా ఎస్పీ శ్రీ బి.బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన డిఎస్పీ పి.జగదీష్ నాయక్ గారు.
సమస్యలు విన్నవించుకున్న 39 మంది అర్జీ దారులు
ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సీసీఎస్ డిఎస్పీ పి.జగదీష్ నాయక్ గారు నిర్వహించారు.
తమ సమస్యలను వెల్లబుచ్చుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను విని, వారు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. వారి సమస్యలను చట్ట పరిధిలో విచారించి పరిష్కారం చూపుతామని తెలిపారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 39 మంది తమ అర్జీలను అందజేసినారు.
ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్ గారు, పి.జి.ఆర్.ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ పి.ప్రభాకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు











