

చీరాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- సంక్రాంతి సంబరాలు పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు
చీరాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు శారద్యంలో చీరాల ఎన్.ఆర్.పి.యం హై స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, బోగి మంటలు, పొంగళ్ల కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల నాట్యాలు, కోలాటాలు నిర్వహించి ప్రజలకు సంప్రదాయ పండుగ వాతావరణాన్ని అందించారు.
చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అనేది మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సమిష్టిగా చీరాల పట్టణంలో ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే చీరాల పట్టణంలో ఉన్న సమస్యలపై ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి, వాటి పరిష్కారానికి మున్సిపాలిటీ చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు ముగ్గులు వేస్తూ, హరిదాసు కీర్తనలు, బోగి మంటలు, గాలి పాటలతో కార్యక్రమం చక్కటి వాతావరణంలో నిర్వహించారని ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







