
“తాళ్లపాక అన్నమాచార్యుల కల్చరల్ స్టేట్ అవార్డు” అందుకున్న వినుకొండ వాసి మందా వెంకట్రావు.

వినుకొండ : Manda Venkatrao Award ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో “శ్రీ అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక” రాజంపేట వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా కడప జిల్లా రాజంపేట. జి.ఎం.సి కళావేదిక నందు సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక పద్య నాటకాలు, అన్నమాచార్యుల ఆత్మీయ గీతాలు, చిన్నారుల కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు జనవరి 11 మరియు 12 తేదీలలో రెండు రోజులు పాటు జరుగుతున్న ఈ కార్యక్రమాలలో రాజంపేట స్థానిక శాసనసభ్యులు ఆకే .అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మన భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద ,పౌరాణిక పద్య నాటకాలు, సంక్రాంతి ముగ్గులు ,హరిదాసుల సందడితో, గంగిరెద్దుల కోలాహలంతో ముందుకు తీసుకురావటం కళాకారుల వల్లే అవుతుందని అన్నారు, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలను (అలనాడు ఆలపించిన)” తాళ్లపాక అన్నమాచార్యుల కల్చరల్ స్టేట్ అవార్డు” ను మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, గుర్రం జాషువా రచనలను పాడి గెలుపొందిన పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఉత్తమ సేవా కళారత్న,సేవా సామ్రాట్, జీవనజ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్౹౹ మందా వెంకట్రావు (వెంకట జాషువా) కు అందించారు.
అవార్డు స్వీకరించిన వెంకట్రావు మాట్లాడుతూ గుర్రం జాషువా కవితలు సాహిత్యం ఎల్లప్పుడూ ప్రజల నాలుకలలో నిలిచిపోతాయని పేదరికం, కులతత్వం పోవాలని కోరుకున్న ఆ మహానుభావుని కవితలు పాడటం నాకు అవార్డు తీసుకురావడం నా జన్మ ధన్యమైందని జాషువా ని కొనియాడారు. అంతరించిపోతున్న కళలను, కళాకారులను ప్రభుత్వం ఆదుకొని వారికి పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇల్లు, ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధన్యాసి పెంచలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, నవభారత కళానిలయం రాష్ట్ర అధ్యక్షులు ఏవి సుబ్బరాజు, ప్రముఖ సినీ డైరెక్టర్ పసుపులేటి గోపీనాథ్, అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజ్యంపేట అధ్యక్షులు నిర్వాహకులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి మరియు కమిటీ సభ్యులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.











