

బాపట్ల, జనవరి.13 : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదల జరిగుతూ ఉంటాయని ఆ సమయంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఎ.ఎస్, పిలుపునిచ్చారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు రహ్-వీర్ లకు నగదు ప్రోత్సాహం మరియు వారి రక్షణ కు సంబంధించిన పోస్టర్స్ ను కలెక్టర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదల జరిగుతూ ఉంటాయని ఆ సమయంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చూచించారు.ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మొదటి గంట సమయం చాలా విలువైనదని, ఆ గంట లోపు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా చేసినట్లయితే ప్రమాద బాధితులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చన్నారు. ఎక్కువగా టు వీలర్స్ నడిపేవారు యాక్సిడెంట్స్ కు గురవుతున్నారని, టు వీలర్ నడిపేవారంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయపడేవారికి రహ్-వీర్ సన్మాన పత్రం తో పాటుగా రూ.25 వేలు నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాద బాధితులకు సహాయపడే వారిని, వారి పేరు మరియు వివరాలు చెప్పమని పోలీసు వారు గానీ హాస్పిటల్ వారు గాని ఒత్తిడి చెయ్యడానికి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రమాద బాధితులకు సహాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల మునిసిపల్ కమిషనర్ రఘునాధ రెడ్డి, ఆర్. టి.సి ఆర్,ఎం. సి. హెచ్ విమల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ డి.బి.వి. రంగా రావు, ఎన్. ప్రసన్న కుమారి, బి. కిషోర్ బాబు, మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎ. ఓ మల్లికార్జున రావు మరియు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .










