

సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలకు భారతదేశంలో అందరికీ ఎంతో గొప్ప పండుగని ఈ పండుగ జరుపుకోవడం కొరకు తెలుగు ప్రజలుఎంతో ఆనందంతో ఎదురు చూస్తుంటారని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవాలని మేదరమెట్ల,కొరిసపాడు ఎస్ఐలు ఎస్కే రఫీ సురేష్ పేర్కొన్నారు, సోమవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ పియు ఆధ్వర్యంలో మేదరమెట్ల టిఐ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగినది మేదరమెట్ల ఎస్సై ఎస్కే రఫీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే మత సామ్రస్యానికి ప్రతీక అని కుల మతాలకు అతీతంగా అందరూ చాలా ఆనందంగా గడుపుకునే పండగని పేర్కొన్నారు కొరిశపాడు ఎస్సై సురేష్ మాట్లాడుతూ నిరుపేదల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి అని నిరుపేదల కుటుంబాల్లో కూడా పండగ వాతావరణం కనిపించాలంటే వారికి మన వంతు సహాయ సహకారం చేస్తూ వారిని కూడా ఆదరించి మన వంతు సహాయ సహకారాలు అందించి వారు కూడా ఈ సంక్రాంతి కనుమ భోగి పండుగ ఆనందంతో గడుపుకునే విధంగా మన వంతు సహాయం అందించాలని వారికి, అని పేర్కొన్నారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డి దుర్గా సురేంద్ర మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కొరకు, హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు క్షేత్రస్థాయిలో మనం చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు సంక్రాంతి సంబరాలు సందర్భంగా హెల్ప్ పి. యూ ఆధ్వర్యంలో సిబ్బందికి రంగోలి పోటీలు మ్యూజిక్ చైర్ వివిధ ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎన్ ఎం ఎం మౌనిక కొరిశపాడు నాగులప్పలపాడు, అద్దంకి మార్టూరు ఓఆర్డబ్ల్యూలు ఆర్ కృష్ణవేణి, ఎం మల్లేశ్వరి, బి. హారిక, వి మల్లేశ్వరి టీ శ్రావణి పాల్గొన్నారు…..







