

కృష్ణాజిల్లా:గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ – 14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు.2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పోటీల నిర్వహణపై.. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్,పోటీలనిర్వహకుల పాల్గొన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీలకు వచ్చే క్రీడాకారులు, కోచ్ లు, ఫెడరేషన్ పెద్దలకు ఇచ్చే ఆతిథ్యం, రవాణా, వసతి ఏర్పాట్లపై సమీక్షించారు.
ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు నిర్వహించే అవకాశం గుడివాడకు రావడం సంతోషకరమని, దేశంలోని వివిధ రాష్ట్రాలు నుండి 45 జట్లు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తకుండా పోటీల నిర్వహణపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్టేడియం సహకారంతో నిర్వహిస్తున్నామని దాతలు తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఎం.ఈ ప్రసాద్, జాతీయ స్థాయి పోటీల నిర్వహణ కార్యదర్శి ఎస్.గంగాధర్, ఎన్.రవిబాబు ,బి.అనిల్,యం రాంబాబు పాల్గొన్నారు.








