
Amaravathi:13-11-25:-హైదరాబాద్ నుంచి అమరావతి, మచిలీపట్నం వరకు కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌కు వేగం పెరిగింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసింది.300 కిలోమీటర్ల పొడవున 6-లేన్లుగా ప్రతిపాదించిన ఈ మార్గం ద్వారా హైదరాబాద్ నుండి మచిలీపట్నం వరకూ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుత రహదారిపై 6–7 గంటలు పడుతుండగా, ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత కేవలం 3–3½ గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
డీపీఆర్ తయారీకి సుమారు ₹15 కోట్లు ఖర్చు కేటాయించగా, తుది నివేదికను 3 నెలల్లో సమర్పించాల్సిందిగా గడువు విధించారు.ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మచిలీపట్నం ఓడరేవు ద్వారా వాణిజ్య రవాణాకు కొత్త ఊపిరి లభించనుంది. తెలంగాణ, రాయలసీమ, మధ్య ఆంధ్ర ప్రాంతాల నుండి నేరుగా సముద్ర తీరానికి చేరుకునే మార్గం ఏర్పడడంతో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతులు మరింత ఉత్సాహం పొందనున్నాయి.







