
హైదరాబాద్, అక్టోబర్ 14:తెలంగాణ టాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ (TTPA) 2025-2027 నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసింది. నగరంలోని బషీర్‌బాగ్ నిజాం క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో పల్లపోలు హరినాథ్ రెడ్డి నేతృత్వంలోని ప్యానల్ విశేష మెజారిటీతో గెలుపొంది పదవులను చేపట్టింది.ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా కె. హుస్సేన్ వలి, రాజశేఖర్ రెడ్డిలు, ప్రధాన కార్యదర్శిగా బైర రమేష్, కోశాధికారిగా సాదు రామారావు, ఉప కార్యదర్శులుగా బాగుల శ్రీనివాస్, జీ. రమేష్ ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా ఎం.వీ.ఎల్. నరసింహారావు, షైక్ ఏజాజ్, కేవీ రామశాస్త్రి, మహేందర్ రెడ్డి సేవలు అందించనున్నారు.
నూతన కమిటీని టాక్స్ ప్రాక్టిషనర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, “జిల్లా స్థాయిలో జీఎస్టీ, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సభ్యుల సందేహాల నివృత్తికి వాట్సాప్ గ్రూపులు, జూమ్ సమావేశాల ద్వారా మద్దతు అందిస్తాం” అని తెలిపారు.అలాగే సంఘ అభివృద్ధి కోసం అవసరమైన భూమిని కేటాయించాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతిపత్రం ద్వారా కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.







