
గుంటూరు, అక్టోబర్ 23: గుంటూరు జిల్లా అమరావతి రోడ్‌లోని సేవా సదన్ కార్యాలయంలో ఈ రోజు హైదరా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సేవా సదన్ అధ్యక్షులు మిరియాల గోపి కుమార్ ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల సమక్షంలో జరిపారు. IKON Guntur కమిటీ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సేవా సదన్ అధ్యక్షులు మిరియాల గోపి కుమార్ “రంగనాథ్ ప్రజల పట్ల చూపించే మానవతా భావం, సాధారణ ప్రజల పట్ల ఉన్న సానుభూతి, ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించే స్వభావం వారిని నిజమైన ప్రజా అధికారి (True People’s Officer)గా నిలబెట్టాయి” అని అన్నారు. టీటీడీ: శ్రీవారి భక్తిగీతాలు 24 గంటలు ఉచితంగా, ప్రకటనలలేకుండా||TTD Offers Free Sri Vari Devotional Songs 24/7 Without Ads

రంగనాథ్ ఎల్లప్పుడూ పేదల, నిరుపేదల పక్షాన నిలబడి, న్యాయం కోసం కృషి చేస్తూ, ప్రజలకు చేరువగా ఉండే పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఆయన ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తూ, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నారని అందరూ ప్రశంసించారు.
ఇటీవలి కాలంలో కొన్ని వర్గాలు “హైడ్రా – హై డ్రామా” అంటూ విమర్శించినా, ప్రజల అభిప్రాయం మాత్రం వేరుగా ఉందని వారు అన్నారు. ఆ కార్యక్రమంలో రంగనాథ్ నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే నిజాయితీ గల అధికారి అని వ్యాఖ్యానించారు.
ఈ వేడుకలో సేవా సదన్ అధ్యక్షులు మిరియాల గోపి కుమార్, ముఖ్య నిర్వాహకులు డేగల వెంకటేశ్వరరావు, సభ్యులు కాయల రామారావు, బండి రామ ప్రభు, బోడపాటి కేశవ, సురేష్ (PF ఆఫీస్), మాతృశ్రీ విద్యాసంస్థల అధినేత బండ్లమూడి గాంధీ, చెరుకూరి శ్రీనివాసరావు, రాజశేఖర్, జాలే శివ నాగరాజు, విన్నకోట శ్రీనివాసరావు, మిరియాల ప్రసాదరావు, బైరా పోతురాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రంగనాథ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు







