
విజయవాడ:
విజయవాడలో నిర్వహించనున్న IJU (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) 11వ ప్లీనరీ సమావేశం బ్రోచర్‌ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రిసెప్షన్ కమిటీ చీఫ్ ప్యాట్రన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌లు సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో CR మీడియా అకాడమీ ఛైర్మన్ & రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్, IJU సెక్రటరీ జనరల్ సోమసుందర్, APUWJ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కే. జయరాజ్, ఉపాధ్యక్షుడు చావా రవి, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. Guntru news :డిప్యూటీ డైరెక్టర్ రమేష్‌కు APUWJ నాయకుల అభినందనలు








