గుంటూరు:
రైతాంగ హక్కుల కోసం పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) గుంటూరులో ఘనంగా జరగనున్నాయి.
ఈ వేడుకలు చంద్రమౌళి నగర్ మెయిన్ రోడ్, పోస్టాఫీస్ దగ్గర ఉన్న మాజేటి కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని, అనంతరం రాత్రి 7 గంటలకు విందు ఏర్పాటు చేసినట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు.
కమిటీ అధ్యక్షులు పరుచూరి సంజీవరావు, కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, సభ్యులు శ్రీధర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూపూడి శ్రీనివాసరావు, మానేపల్లి దుర్గారావు, సాయి, కిరణ్, పాపారావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ జీవితం – రైతాంగానికి ప్రేరణ
చిట్యాల ఐలమ్మ 1895లో వరంగల్ జిల్లా, కృష్ణాపురం గ్రామంలో జన్మించారు.
రైతులకు అన్యాయం జరిగితే ఎదురొడ్డి నిలిచిన ఆమె, రైతాంగ హక్కుల కోసం దొరలతో పోరాడారు.
10 ఎకరాల భూమి కోసం జరిగిన పోరాటంలో “వీరనారి”గా చరిత్రలో నిలిచారు.
రైతులు, శ్రామికులు, కూలీలకు బలమై నిలిచిన ఐలమ్మ పేరు నేటికీ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు పెట్టి గౌరవిస్తున్నారు. 1985 సెప్టెంబర్ 10న ఆమె కన్నుమూశారు.