ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు పొడిగిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు శుక్ల శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆగస్టు 31 వరకు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు, 1 సెప్టెంబర్, 2025 నుండి 30 నవంబర్, 2025 వరకు లేదా నూతన అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
In view of the expiry of the accreditation cards of journalists in the state of Andhra Pradesh, Director of Information and Public Relations Shri Himanshu Shukla issued orders on Friday to extend the validity of accreditation cards for another three months. The extension orders will be in force for another three months, from September 1, 2025 to November 30, 2025, or the process of issuing new accreditation cards, whichever is earlier, for journalists who currently have accreditation cards till August 31, said Director of Information and Public Relations Shri Himanshu Shukla in a statement.