
BIG INCOME TAX UPDATE
YOU MUST KNOW THIS!
1. వయస్సుతో సంబంధం లేకుండా కొత్త పన్ను విధానంలో రూ.7,75,000 వరకు ఆదాయానికి పన్ను లేదు.
2. 80CCD(2) కింద మినహాయింపు పొందాలంటే ఉద్యోగి కాంట్రిబ్యూషన్ చూపించడం తప్పనిసరి.
3. పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానం ఎంచుకోవడం పూర్తిగా ఉద్యోగి / పెన్షనర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
4. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న అన్ని మినహాయింపులు వర్తిస్తాయి.
5. స్వంత ఇల్లు చూపినట్లయితే సెక్షన్ 10(13A) కింద HRA మినహాయింపు వర్తించదు (జీరో).
6. HRA క్లెయిమ్ విషయంలో
- వార్షిక అద్దె రూ.1,00,000 దాటితే ఇంటి యజమాని PAN తప్పనిసరి
- వార్షిక అద్దె రూ.2,40,000 దాటితే సెక్షన్ 194I ప్రకారం 10% TDS,
ఫారం 26QC ద్వారా చెల్లించాలి - అంటే నెలకు రూ.12,000 అద్దె దాటితే DDOలకు TDS వివరాలు ఇవ్వాలి
7. స్వంత ఇల్లు, అద్దె ఇల్లు రెండింటినీ చూపించవచ్చు, అయితే DDOకి డిక్లరేషన్ ఇవ్వాలి.
8. అన్ని పన్ను మినహాయింపులు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్యలోనే ఉండాలి.
9. 80D హెల్త్ ఇన్సూరెన్స్ కింద
- తల్లిదండ్రుల బీమా క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ చేసే వ్యక్తి నామినీగా ఉండాలి
- సెల్ఫ్ బీమాకు గరిష్ఠంగా రూ.25,000 మాత్రమే మినహాయింపు
10. దివ్యాంగులు / ఆధారిత దివ్యాంగులు ఉన్నవారు
- 80U కింద మినహాయింపు పొందాలంటే
- లేటెస్ట్ సదరం సర్టిఫికేట్, దివ్యాంగ శాతం తప్పనిసరి
- ఈ-ఫైలింగ్ సమయంలో ఫారం 10-IA అప్లోడ్ చేయాలి
11. హౌస్ లోన్ ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ
- చెరో రూ.2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు
- షరతు: Co-owner లేదా Co-borrower అయి ఉండాలి
12. సెక్షన్ 24B కింద రూ.2 లక్షలకు అదనంగా
- 80EE / 80EEA కింద కూడా మినహాయింపులు వర్తిస్తాయి
- అర్హతలను ఆన్‌లైన్‌లో పరిశీలించాలి
13. ఎడ్యుకేషన్ లోన్ వడ్డీపై పరిమితి లేదు, పూర్తిగా మినహాయింపు పొందవచ్చు.
14. 80G కింద దానధర్మాలు
- రూ.2,000 కంటే ఎక్కువైతే నగదు రూపంలో ఇవ్వకూడదు
15. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ మొత్తం ఆదాయంలో తప్పనిసరిగా కలపాలి,
దీనిని DDOలు తిరస్కరించరాదు.
16. సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ మినహాయింపు
- సాధారణ వ్యక్తులకు రూ.10,000 వరకు
- సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు
- ఇవి పాత పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తాయి
17. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ముందు
- 3 క్వార్టర్స్ వరకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించామా లేదా చెక్ చేసుకోవాలి.
18. అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటే
- చలాన్ 280 ద్వారా
- Self Assessment Taxగా
- PAN నంబర్ మీద,
- 2025–26 అసెస్‌మెంట్ ఇయర్కు చెల్లించి
- రిటర్నుకు జత చేస్తే సరిపోతుంది.
- TAN నంబర్ మీద చెల్లిస్తే DDOలు మళ్లీ TDS చేసే వరకు వేచి చూడాల్సి
- ఉంటుంది.
19. ప్రస్తుతం ఆడిటర్లు 26ASలో చూపిన ఖచ్చితమైన జీతం కాలమ్ ఆధారంగానే TDS చేస్తున్నారు.











