chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం–కంచి జగద్గురువులకు ఘన స్వాగతం

విజయవాడ:-ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు శనివారం విజయవాడకు విచ్చేశారు.

Vijayawada Local News :ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం–కంచి జగద్గురువులకు ఘన స్వాగతం

ఇంద్రకీలాద్రికి వేంచేస్తున్న జగద్గురువులకు తొలుత ప్రకాశం బ్యారేజ్ వద్ద దేవస్థానం తరపున ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ దుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనానాయక్, ఆలయ అర్చకులు, ధర్మకర్తలు స్వామివారికి పుష్పమాలలు సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారిని శోభాయాత్రగా ఇంద్రకీలాద్రిపైకి తీసుకెళ్లారు.

ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జగద్గురువులకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను సమర్పించి గౌరవించారు.

అనంతరం స్వామివారు కుంభాభిషేక మహోత్సవం కోసం ఏర్పాటు చేసిన మహా యాగశాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న చతుర్వేద పారాయణలు, హోమాలు, వైదిక క్రతువులను క్షుణ్ణంగా పరిశీలించారు. వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు ప్రస్తుత ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను స్వామివారికి వివరించారు. ఈ సందర్భంగా జగద్గురువులు అధికారులకు, అర్చకులకు అమూల్యమైన సూచనలు అందిస్తూ ఆశీస్సులు అందజేశారు.Vijayawada Localnews

ఈ మహా యజ్ఞం విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ జగద్గురువులు అనుగ్రహ భాషణం చేశారు. జగద్గురువుల రాకతో ఇంద్రకీలాద్రి భక్తి సంద్రమైందని, కంచి పీఠాధిపతుల పావన దర్శనంతో కుంభాభిషేక మహోత్సవాలకు మరింత విశిష్టత చేకూరిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఏఈఓలు, పర్యవేక్షకులు, వేద పండితులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker