chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

163 Inspiring Lessons from Swami Vivekananda: Chirala MLA Pays Tribute|| స్వామి వివేకానంద 163వ జయంతి: చీరాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘన నివాళులు

స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.

163 Inspiring Lessons from Swami Vivekananda: Chirala MLA Pays Tribute|| స్వామి వివేకానంద 163వ జయంతి: చీరాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘన నివాళులు

స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12 నాడు కోల్ కత్తాలో జన్మించి. కేవలం 39 సంవత్సరాల ఆరు నెలలు జీవించారు. అంతతక్కువ వయోపరిమితిలో కూడా అనితర సాధ్యమైన పనులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఒక అద్వైత వేదాంతి తొలిసారిగా పాశ్చాత్య దేశాలను పర్యటించడం… ప్రపంచానికి అంతటికీ భారతీయుల ఔన్నత్యాన్ని చాటిచెప్పడం అనేవి స్వామి వివేకానందలోనే చూడగలం. స్వామి శిష్యులలో పాశ్చాత్యులు సైతం భారతదేశానికి ఎంతో సేవచేశారు.

స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది. వివేకానందుల జయంతి సందర్భంగా ఆయన సందేశాలు జ్ఞాపకం చేసుకొని ఆచరిద్దాం. ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది.

యువతను జాగృతం చేసిన స్వామీ వివేకానంద గారి ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ దేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ, దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ, మరింత బలంగా ముందుకు సాగాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు వేణు పిక్కి నారాయణ గుమ్మ వెంకటేష్ బోయిన శీను మంగపతి మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోటల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker