

నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS)
అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలి
ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పి జి ఆర్ ఎస్ అర్జీల పై జిల్లా అధికారులతో సమావేశం
- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోదకుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల,నవంబర్ 16 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీల పై ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించడం జరుగుతుందని,
అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ తో పాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్ లో మరియు మండల తహశీల్దార్లు కార్యాలయాలలో ను తహశీల్దార్లు, ఎంపీ డి ఓ లు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
అర్జీదారులు అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునని,
Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని, పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.







