
అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (IHRC–GENEVA) అంతర్జాతీయ రాయబారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా. కుందవరం రాజానందన్ విజ్ఞన్ నియమితులయ్యారు. ఈ మేరకు IHRC–GENEVA ఇంటర్ సెక్రటరీ జనరల్ డా. సైఫుల్ ఇ దిల్దార్ అధికారిక లేఖను పంపించారు. ఈ నిర్ణయం 2025 నవంబర్ 21 నుండి అమల్లోకి వచ్చింది.మానవ హక్కుల రంగంలో ఆయన చేస్తున్న సేవలు, ప్రజలకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవల పట్ల ఉన్న అంకితభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కీలక పదవికి నియమించినట్లు లేఖలో పేర్కొన్నారు.IHRC–GENEVA తరఫున ఆంధ్రప్రదేశ్, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆయనకు అధికారాలు ఇచ్చినట్లు లేఖలో స్పష్టంచేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సభ్యులను నియమించడంతో పాటు సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని బాధ్యతలు అప్పగించారు.డా. కుందవరం విజ్ఞన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత సేవలందించాలని IHRC-జెనీవా తమ ఆకాంక్షను వ్యక్తం చేసింది.







