
హైదరాబాద్, అక్టోబర్ 22 (CITY న్యూస తెలుగు ): మానసిక ఆరోగ్య రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వార్షిక సదస్సు ‘IPSOCON–2025’ ఈ నెల 24 నుంచి 26 వరకు గచ్చిబౌలిలోని ESCI వేదికగా జరగనుంది. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇది 58వ వార్షిక సమావేశం.
ఈ సదస్సు యొక్క ప్రధాన అంశం “Newer Horizons and Frontiers in understanding ADHD across Lifespan”. జీవితంలోని వివిధ దశల్లో ADHD (Attention Deficit Hyperactivity Disorder) పై తాజా పరిశోధనలు, చికిత్సా పద్ధతులు, సామాజిక అవగాహన అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. దేశంలోని ప్రముఖ సైకియాట్రిస్టులు, పరిశోధకులు, వైద్య విద్యార్థులు పాల్గొనబోతున్నారు. IPSOCON 2025 హైదరాబాద్‌లో – ADHD అవగాహనపై అంతర్జాతీయ సదస్సు:అక్టోబర్ 24, 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో
ప్రధాన సదస్సుకు ముందురోజు అక్టోబర్ 23న (గురువారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు ప్రీకాన్ఫరెన్స్ వర్క్‌షాపులు జరగనున్నాయి. “Psychosocial Management of Addictions” అనే అంశంపై డా. షాహుల్ అమీన్, “Strengthening Peer Review: Skills, Ethics and Best Practices” అంశంపై డా. రాజ్‌శేఖర్ బిపేటా, డా. సుజిత్ సార్ఖెల్, అలాగే “More Than Meets the Eye: Unmasking Comorbidities in Autism” అంశంపై డా. సుహాస్ చంద్రన్ బోధించనున్నారు. ప్రతి వర్క్‌షాప్‌కు 30 నుంచి 40 మంది డెలిగేట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు, యువ సైకియాట్రిస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీజనల్ ఫ్రూట్స్‌తో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ – ఏడాది పొడవునా తినాల్సిన పండ్లు..
ADHD, ఆటిజం, వ్యసనాలు వంటి మానసిక సమస్యలపై తాజా శాస్త్రీయ దిశలను అన్వేషించేందుకు, వైద్య రంగంలో అనుసరించాల్సిన నైతిక ప్రమాణాలపై చర్చించేందుకు ఈ సదస్సు వేదిక కానుంది. నిర్వాహకుల ప్రకారం, ఈ కార్యక్రమం ద్వారా యువ సైకియాట్రిస్టులకు శిక్షణా అవకాశాలు, పరిశోధనాభివృద్ధి మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.







