ఉపరాష్ట్రపతి ఎన్నికల ధర్మం – ధర్మమేనా?
- ఆటోలో ప్రచారం 30-08-2025
- సత్యాగ్రహ నిరసన నిరాహార దీక్ష
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో గాంధీజీ చేసిన దండియాత్ర ఒక మహోన్నత అధ్యాయం. అహింసా మార్గంలో, సత్యాగ్రహ సిద్ధాంతంతో బ్రిటిష్ పాలనను సవాలు చేసి, ప్రజల్లో అపారమైన చైతన్యం నింపిన ఆ యాత్ర ఈ దేశానికి దిశా నిర్దేశం చేసింది. అదే స్ఫూర్తితో, ఈ తరం ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు R.R. గాంధీ నాగరాజన్ “దండియాత్ర – 2” పేరుతో సత్యాగ్రహ నీరసన దీక్ష చేపట్టారు.
గాంధీజీ ఆశయాల సాధన:గాంధీజీ చూపిన మార్గం కేవలం స్వాతంత్ర్యం కొరకు మాత్రమే కాదు, సమాజ మార్పు కొరకు కూడా. నిజాయితీ, సత్యం, అహింస, త్యాగం – ఇవే ఆయన ఆశయాలు. అదే విలువలను పట్టుకుని, నాగరాజన్ గారు నేటి సమాజంలో మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు.
ఆయన నినాదం – నేటి కాలానికి అద్దం:“మంచి ఓటు మన మోదాం – అదే మంచి వ్యక్తికే వేద్దాం” అనే ఆయన పిలుపు కేవలం ఒక నినాదం కాదు, ప్రజాస్వామ్య రక్షణకు ఒక శక్తివంతమైన ఆయుధం.రాజకీయాల్లో పార్టీల పరిరక్షణ కాదు, ప్రజల పరిరక్షణే నిజమైన ధర్మమని ఆయన చెబుతున్నారు.అవినీతి, అక్రమాలు, అధికారం దుర్వినియోగం వంటి సమస్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తన యాత్ర యొక్క అసలు ఉద్దేశమని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ధర్మం – ధర్మమేనా?
దేశ ప్రజాస్వామ్యంలో ఉపరాష్ట్రపతి పదవి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ పదవి కేవలం రాజకీయం కోసం కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ముందుకు వస్తున్నాయి.
పార్టీ రక్షణ కాదు – పరిపాలన రక్షణే ధర్మం:ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం పోటీ పడతాయి. కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చూపిన దారిని చూస్తే స్పష్టమవుతుంది – పదవి అనేది పార్టీ రక్షణ కోసం కాదు, పరిపాలన రక్షణ కోసం ఉండాలి. రాధాకృష్ణన్ గారు విద్యావేత్తగా, తాత్వికుడిగా దేశాన్ని మార్గనిర్దేశం చేసినట్లే, ఉపరాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి కూడా దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకే అంకితం కావాలి.
- ప్రజాస్వామ్య రక్షణ – ప్రజల రక్షణ:ఈ ఎన్నికల సందర్భంలో Ex సుప్రీం కోర్టు న్యాయమూర్తి B. సుదర్శన్ రెడ్డి ఒక చిహ్నంలా నిలుస్తున్నారు. ఆయన ఆలోచనలే చెబుతున్నాయి – పార్టీ రక్షణ కాదు, ప్రజాస్వామ్య రక్షణే అసలు ధర్మం. ప్రజల హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం నిలువడానికి ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి. అందుకే ఆయన వంటి నిజాయితీ గల వ్యక్తులు ఈ పదవికి వస్తే దేశానికి శ్రేయస్సు కలుగుతుంది
ధర్మపరమైన తీర్పులు – ప్రజాస్వామ్యానికి కవచం: సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పులు ప్రజల కోసం, ధర్మం కోసం ఇచ్చినవే. ఆయన జీవితకాలం న్యాయాన్ని ధర్మంతో కలిపి చూపినవాడు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే ఆయనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
“రక్షించండి! రక్షించండి!! ప్రజాస్వామ్యాన్ని రక్షించండి” అనే ఆయన పిలుపు ఈ ఎన్నికల సందర్భంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కేవలం ఓ హక్కు కాదు – ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత.