

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC ) ద్వారా B.Tech, Diploma, B.Sc మరియు B. Com చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు స్థానిక స్కిల్ హబ్ నందు Application Developer- Web & Mobile కోర్స్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పెడన గౌరవనీయ శాసన సభ్యులు తెలిపారు.
స్థానిక యువత ఐటి కోర్సుల శిక్షణ కొరకు పెద్ద నగరాలకు వెళ్లే అవసరం లేకుండా నే సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐటీ కోర్స్ లపై శిక్షణ స్థానికంగా పెడన లోనే అది కూడా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమం లో భాగముగా స్థానిక స్కిల్ హబ్ లో మొదటగా Application Developer Web & Mobile 3 నెలల కోర్స్ లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు, ఈ శిక్షణకు సంబంధించి B.Tech, Diploma, B.Sc మరియు B. Com చదివి వయసు 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని, శిక్షణ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోర్స్ గుర్తింవు సర్టిఫికెట్ ప్రధానం చేస్తారని, శిక్షణ అనంతరం ఉపాధికి తగిన సహకారంతో పాటు, NASSCOM గుర్తింపు గల ఈ కోర్స్ శిక్షణ తో NASSCOM సభ్యత్వం గల ఐటి కంపెనీలలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు మెరుగవుతాయని, డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని, మరింత సమాచారం కోసం స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ 8897772488 నందు సంప్రదించాలని శాసన సభ్యుల కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.







