
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి
ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఓట్ల కోసం కూటమి నేతలు, ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు, లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు, పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే 1.62 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.







