BAPATLA NEWS : లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి స్కాలర్‌షిప్ ను సాధించినసెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి..
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల, మొదటి సంవత్సరము చదువుతున్న విద్యార్ధులు జాతీయ స్ధాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి విన్ని సన్ స్కాలర్‌షిప్‌ను సాధించారని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు మరియు కరస్పాండెంట్ యస్. లక్ష్మణ రావు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల లోటస్ పెటల్ ఫౌండేషన్ వారు వారు నిర్వహించిన జాతీయస్ధాయి ఇంటర్వూలో నెగ్గీ 4సం॥ పాటు విన్ని సన్ స్కాలర్‌షిప్ ను కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డా॥ కె,జగీదష్ బాబు తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగములో మొదటి సంవత్సము చదువుతున్న విద్యార్ధిని యస్. విజయ రేణుక లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి విన్ని సన్ స్కాలర్ షిప్‌ను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ క్రింద సంవత్సరము నకు రు.62,300/` చొ॥న 4సం॥లు పాటు లోటస్ పెటల్ ఫౌండేషన్ వారు స్కాలర్‌షిప్‌ను అందజేస్తారని తెలిపారు. లోటస్ పెటల్ ఫౌండేషన్ వారు జాతీయ స్ధాయిలో విన్ని సన్ స్కాలర్ షిప్ విద్యార్ధులను ఎంపిక చేయగా అందులో కళాశాలకు చెందిన విద్యార్ధిని పాందటం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భముగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఇన్ చార్జ్ యస్. అమరనాధ్ బాబు మరియు సి.యస్.ఇ విభాగాధిపతి డా॥ పి.హరిణి , అధ్యాపకులు, విద్యార్ధులు మరియు అధ్యాపకేతర సిబ్బంది యస్. విజయ రేణుక లకు అభినందనలు తెలియ జేశారు.