పార్టీ నాయకులతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ
రైతు సమస్యలపై 9న నందిగామ ఆర్డీఓ కేంద్రాల వద్ద శాంతియుతంగా ఆందోళన అనంతరం వినతిపత్రాల అందజేత
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై మొద్దునిద్రపోతుంది అని, అన్నదాతలపట్ల నిర్లక్ష్యంతో ఉన్న ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఈనెల 9న నందిగామ ఆర్డీవో కార్యాలయం లో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
యూరియా అడిగితే రైతులను జైల్లో పెడతా మంటూ ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవాల్సింది పోయి వారినే జైల్లో పెడతా మంటూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు, యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్న రైతులను కించపరుస్తూ విమర్శించడం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు నిదర్శనమని అన్నారు
ఈ పోరాటంతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగిరావాలి. యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టి ఎమ్మార్పీకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని
రైతులకు యూరియాను ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా గాని, రైతు భరోసా కేంద్రాల ద్వారా గాని రైతులకు ఇబ్బంది లేకుండా అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇన్పుట్ సబ్సిడీ,క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి, రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని
రైతులకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నాం. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారని దుర్మార్గమైన ఈ ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది అని,రైతు సమస్యల విషయంలో మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొలుపే వరకు వదిలిపెట్టేది లేదని అని అన్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతన్నను చేయి పట్టి నడిపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఐదేళ్లలో నిర్మించిన వ్యవస్థలను, తీసుకొచ్చిన మార్పులను నాశనం చేశారు. రాష్ట్రంలో యూరియా కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నా ఎరువులు కోరత లేదని చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నారో తెలియడంలేదు. రైతులే రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వారిపై వైఎస్సార్సీపీ ముద్రవేసి బొక్కలో వేస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన బెదిరిస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, పొన్నం కోటేశ్వరరావు, గుత్తా శంకర్రావు, పట్టణ పార్టీ పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృధ్వీరాజ్, రాష్ట్ర లీగల్ సెల్ పసుపులేటి సత్య శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు