
జగ్గయ్యపేట: ఆంధ్రరాష్ట్ర అవతరణకు తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక అని వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కొనియాడారు. సోమవారం జగ్గయ్యపేటలోని నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి తన్నీరు నాగేశ్వరరావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడి, ఆంధ్ర రాష్ట్ర సిద్ధాంతానికి బాటలు వేసిన మహనీయుడు శ్రీరాములు అని, ఆయన త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రైతు విభాగ నాయకులు నంబూరి రవి, పింగళి నరసింహారెడ్డి, మన్నే అప్పారావు, మోరే దుర్గాప్రసాద్, రామిని ఉపేందర్ రెడ్డి, దమ్మాలపాటి సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.Eluru Local News







