
గుంటూరు:10-11-25:- నగరంలోని పట్టాభిపురం స్వామి థియేటర్ ప్రాంగణం ఆదివారం భక్తుల సందడితో కిక్కిరిసింది. జన చైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.కార్యక్రమంలో వేళా సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. గురుస్వాములు రాంబాబు, డేగల విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. అయ్యప్ప స్వాములకు హారతి పూజలు నిర్వహించగా, డప్పు శ్రీను స్వామి నేతృత్వంలో భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

“స్వామియే శరణం అయ్యప్ప… శరణంశరణం అయ్యప్ప…” నినాదాలతో గుంటూరు నగరం మార్మోగింది. భక్తులు అయ్యప్ప నామస్మరణలో తేలిపోయారు.అయ్యప్ప స్వాములకు 18 పడిమెట్ల పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహానికి పంచామృత అభిషేకం, కుంకుమ, చందన, పసుపు, భస్మాభిషేకాలు ఘనంగా చేశారు. చివరగా మహా మంగళహారతితో పూజా కార్యక్రమం ముగిసింది.భక్తి ఉత్సాహంతో పాల్గొన్న అయ్యప్ప స్వాములు, భజన గోష్ఠులు, ఆధ్యాత్మిక వాతావరణం ఆ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చాయి.







