
తెనాలి, మార్చి 14: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని బోసురోడ్డులో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ప్రజల పక్షాన పోరాటమే లక్ష్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, యువతలో ధైర్యం నింపే శక్తిగా పార్టీ ఎదుగుతోందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సేవా కార్యక్రమాలతో చాటుకున్న ఉదారత
పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు ఉచితంగా భోజన వసతి కల్పించడంతో పాటు, పండ్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రజా సేవలో జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.Tenali Local news: అధైర్యం వద్దు… ప్రతి గింజ కొంటాం







