
బాపట్ల: నవంబర్ 24 :-జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సంక్షేమం పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూపుతున్న శ్రద్ధకు కొనసాగింపుగా, ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆదివారం బాపట్ల నియోజకవర్గానికి చెందిన హుకుమతిరావు నాగంజనేయులు కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.జనసేన సభ్యత్వం తీసుకుని పార్టీ కోసం పనిచేసిన వివిధ కార్యకర్తలు ప్రమాదాలలో మృతి చెందడంతో, వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 220 మంది సభ్యుల కుటుంబాలకు మొత్తం రూ.11 కోట్లు జనసేన అందజేసినట్లు నేతలు తెలిపారు.
బాపట్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు విన్నకోట సురేష్, హుకుమతిరావు నాగంజనేయులు భార్యను అన్నపూర్ణ కన్వెన్షన్ హాలుకు తీసుకువెళ్లి, నాగబాబు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. పార్టీ తరఫున లభించిన ఈ సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాయకులు విన్నకోట సురేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి మహేష్, గరిగంటి శ్రీనివాసరావు, సాయిన రాంబాబు, గుర్రాల రామారావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







