
చిన్నగంజాం (పర్చూరు నియోజకవర్గం): బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని చిన్నగంజాం, కడవకుదురు ప్రాంతాలలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల వద్ద జనసేన జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ఆయనతో పాటు జనసేన జిల్లా కార్యదర్శి శంకర్ శెట్టి చిరంజీవి, కారంచేడు మండల అధ్యక్షుడు సాగిరి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

చిన్నగంజాం మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు, తోట అశోక చక్రవర్తి, వెంకటేష్, ఎడవల్లి వెంకటరావు, చెన్నుపాటి నిరంజన్ కుమార్ మరియు గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.







