
బాపట్ల, జనవరి 25, 2026:-జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని సీల్ రోడ్డులో ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జి. గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్నారుbapatla news.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు, పాఠశాలల విద్యార్థులు, బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు హక్కు విలువను చాటిచెప్పే నినాదాలు, ప్లకార్డులతో ర్యాలీ సందడిగా సాగింది. యువతలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఎన్నికల ప్రక్రియలో చురుకైన పాల్గొనడం కోసం జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










