
వేటపాలెం, జనవరి 30:-చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన ఇ.ఇ.ఇ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) విభాగం విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి కళాశాలకు గర్వకారణమయ్యారని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు తెలిపారు.
ఇటీవల నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘జూబ్లియన్–2025’ పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘ఎలక్ట్రో హాక్’ విభాగంలో సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు రెండవ బహుమతి సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు వెల్లడించారు.
ఇ.ఇ.ఇ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న యన్. రాజేష్, పి. శివ మణికంఠ, పి. మహేంద్ర రెడ్డిల బృందం ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారని విభాగాధిపతి డా. యస్.వి.డి. అనిల్ కుమార్ తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతులు అందజేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.Bapatla local news










