
కర్నూలులో నిర్వహించిన జి.కె.ఎం.ఏ 12వ జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ – 2025లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని అద్భుత విజయాన్ని సాధించారు. ఈ పోటీల్లో విద్యార్థులు మొత్తం 10 పతకాలు గెలుచుకున్నారు.సువర్ణ పతకాలు అర్వింద్, జోవినా దక్కించుకోగా, రజత పతకాలు అనన్య, నమస్వి గెలుచుకున్నారు. అలాగే కాంస్య పతకాలు రేవంత్, మోహన్ గౌతమ్, తౌఫిక్, ప్రద్యున్, రామ్ వరెన్య, సహస్రలకు లభించాయి.ఈ అద్భుత విజయంతో పాఠశాల గర్వకారణమైందని, విద్యార్థుల క్రమశిక్షణ, కృషి, పట్టుదల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు.







