
Parchuru:- ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన ఏ. సాంబశివరావు, శివ నారాయణ, షేక్ రెహమాన్, నాగరాజులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని, క్రీడల ద్వారా రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, అంకితభావంతో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.Bapatla Local News
క్రీడాకారుల విజయాలు యువతకు స్ఫూర్తినిస్తాయని, క్రీడలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.










