
బాపట్ల: డిసెంబర్ 4:-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డా. వినోద్ కుమార్ వి గారు అద్దంకి నియోజకవర్గంలో జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న 12 కంపెనీలు పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. వినోద్ కుమార్ వి గారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు దక్కే అవకాశాలు ఉన్నందున నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి మాధవి, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి శ్రీనివాస్ బేగాల, ఏడీఎస్డీ (FAC) రవికిరణ్, డీఎంహెచ్ఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.







